నేడే హనుమజ్జయంతి:




                                                               జై హనుమాన్




చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపమెలిగిస్తే అష్టైశ్వర్యాలీ చేకూరుతాయి. హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు, పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి.

పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి.

పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యానశ్లోకము

బన్నీ, జూ ఎన్టీఆర్లలా త్వరలో పెళ్ళిపీటలెక్కనున్న ప్రభాస్..!,రవితేజకు ఓ భారీ అవకాశం

Veera
పేరు తెచ్చుకున్న రవితేజకు ఓ భారీ అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘యుటివి’ మోషన్ పిక్చర్స్ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటోందట. కాగా ఈ సంస్థ దృష్టి రవితేజపై పడిందని తెలుస్తోంది. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజతో సినిమాలు చేస్తే హిట్, మినమమ్ గ్యారంటీ సినిమాలు చెయ్యొచ్చని భావిస్తోందట ఈ సంస్థ. దాంతో రవితేజ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

‘యుటివి’లాంటి సంస్థ భారీగా ఖర్చు పెట్టి సినిమాలు చేయగలదు కాబట్టి, ఈ సంస్థలో సినిమాలు చేయడం వల్ల తన రేంజ్ మరింతగా పెరుగుతుందని రవితేజ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సంస్థలో రవితేజ చేయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం.






Prabhas

.బన్నీ, జూ ఎన్టీఆర్ ల బాటలో ఇప్పుడు ప్రభాస్ కూడా పయనించనున్నాడు. అంటే, సినిమాల పరంగా కాదు... వాళ్లిద్దరిలా త్వరలో తనూ ఓ ఇంటి వాడు కానున్నాడు. ఇటీవలే బన్నీ పెళ్లి చేసుకున్నాడు. జూ ఎన్టీఆర్ మే 5 న చేసుకోబోతున్నాడు. వీళ్ళిద్దరిలా ప్రభాస్ కూడా ఈ సంవత్సరమే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాడు.

దీనికి సంబంధించి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇప్పటికే ప్రభాస్ కి పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారని తెలుస్తోంది. అయితే సినిమా రంగానికి సంబంధం లేని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. తను లవ్ మేరేజ్ చేసుకోనున్నాడని మరికొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఇంతకీ... తను లవ్ మేరేజ్ చేసుకుంటాడా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటాడా? అన్నది త్వరలో తెలుస్తుంది.

సినిమా కబుర్లు వినోదం








సినిమా కబుర్లు

.

22న మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దశరథ్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నిర్మాత మీడియాకు ఆదివారంనాడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'సినిమా పూర్తయింది. 22న విడుదల కానుంది. ఈ వేసవి ప్రేక్షకులను అలరిస్తుంది. అన్ని వర్గాలకు నచ్చే, యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. రచయిత అబ్బూరి రవితో మిగిలిన సాంకతిక నిపుణులంతా బాగా పనిచేశారు. కొత్తపాయింట్‌తో రూపొందింది. ఈరోజు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ వెబ్‌సైట్‌ విడుదల చేస్తున్నాం. గత సంవత్సరం మార్చిలో ప్రారంభించాం. ఒక హీరోయిన్‌ వల్ల అసంతృప్తి కలిగింది. దాంతో ఆపివేశాం. తరువాత చాలా కష్టపడి పూర్తిచేశాం' అని తెలిపారు.
దర్శకుడు దశరథ్‌ మాట్లాడుతూ...'సినిమా ప్రేక్షకులకు సమ్మర్‌ స్పెషల్‌ అవుతుంది. మూడు సంవత్సరాల క్రితం ఎలాంటి నమ్మకంతో ఉన్నామో, ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నాం. దానికి కారణం దిల్‌రాజు. ఏడాది పాటు షూటింగ్‌ జరిగినా, అదే బాడీ లాంగ్వేజ్‌ను ప్రభాస్‌ మెయింటేన్‌ చేశాడు. ప్రతీ ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. దేవి చక్కటి సంగీతాన్ని అందించారు' అని అన్నారు.

2030 నాటికి స్త్రీ పురుషుల





మహిళలల స్పెషల్



2030 నాటికి స్త్రీ పురుషుల మధ్య భారీ వ్యత్యాసం!!  
మున్ముందు కన్యాశుల్కం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయా? అవుననే సంకేతాలు వెలువరిస్తున్నాయి కొన్ని అధ్యయనాలు. వచ్చే 2030 నాటికి స్త్రీపురుషుల జనాభాలో 20 శాతం వరకు వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది. అంటే.. వచ్చే రెండు దశాబ్దాల్లో స్త్రీల కంటే పురుషులు (యువకుల) సంఖ్య సాధారణ స్థాయిని మించి 20 శాతం మేరకు పెరగనున్నారు. దీనివల్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే యువకుల మధ్య పోటీ తప్పే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు.
దీనికి ప్రధాన కారణం భ్రూణ హత్యలేనని అంటున్నారు. మగపిల్లల పట్ల ఉన్న మక్కువ, ఆడపిల్లలపై లేక పోవడమేనని అంటున్నారు. ప్రధానంగా లింగనిర్ధారణ పరీక్షల సమయంలో గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తేలితే గర్భస్రావాలకు పాల్పడే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా.. స్త్రీ, పురుషుల జనాభా నిష్పత్తుల మధ్య తీవ్ర వ్యత్యాసానికి కారణమై దీర్ఘకాలిక విపరిణామలాలకు దారితీసే అవకాశముందని ఆ అధ్యయనం పేర్కొంది.
ఈ వ్యత్యాసం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కేరళ వంటి వాటిల్లో మాముల స్థాయిలోనే ఉండగా పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లలో భారీగా ఉందని తెలిపింది. సాధారణంగా పుట్టుక సమయంలోనే ప్రతి 105 మంది పురుషుల సంఖ్యకు 100 మంది మహిళలు జన్మిస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా అమ్మాయిల డిమాండ్ పెరిగి పోయి, కన్యాశుల్కం ఇచ్చి వివాహాలు చేసుకునే పరిస్థితి పునరావృత్తం కావొచ్చని పలువురు హెచ్చరిస్తున్నారు.

హిందూ స్త్రీలు - ఆస్తి హక్కు

మహిళలల ,ఆస్తి హక్కు








1. ఈ చట్టము ప్రారంభమునకు పూర్వము... సంపాదించిబడినను తరువాత సంపాదించబడినను, హిందూ స్ర్తీ యొక్క స్వాధీనములోనున్న ఏ ఆస్తి యందైనను ఆమె సర్వహక్కులు కలిగియుండును. అంతేగాని పరిమితమైన హక్కు కాదు.

వివరణ:

ఈ సబ్‌ సెక్షన్‌లో ‘ఆస్తి’ అనగా చర, స్థిర రూపమైన రెండు విధములైనవి అనియును, ఆ ఆస్తి ఆమెకు పంపకములో వచ్చినను మనోవర్తికి బదులుగా ఈయబడినది అయినను; లేదా వారసత్వ రీత్యా గాని మరియొక్క విధముగా గాని సంక్రమించినది అయినను; లేదా మనోవర్తి బకాయి చెల్లింపు కింద వచ్చినది అయినను లేదా వివాహమునకు ముందుగాని వివాహ సమయమున గాని, వివాహము అయిన తరువాత గాని, బంధువుల చేత గాని, ఇతరులచే గాని ఈయబడిన బహుమతి ద్వారా వచ్చినది అయినను లేదా ఆమె స్వకాయ కష్టముచే సంపాదింపబడినది అయినను; లేదా ఆమె కొనుగోలు చేయబడినది గాని, చిరకాలానుభవముచే పొందబడినదైనను లేదా మరి ఏ ఇతర విధముగా పొందబడినదైనను మరిన్ని ఈ చట్టము ప్రారంభమునకు పూర్వము ఆమెచే ‘స్ర్తీ ధనము’ గా పొందబడి ఉన్నదే అయినను ఈ సబ్‌ సెక్షన్‌ లోని ‘ఆస్తి’ యను పదము క్రిందకే వచ్చును.

2. పై మొదటి సబ్‌ సెక్షన్‌లో చెప్పబడినట్లు సర్వహక్కులు కలిగియుండుట కొన్ని విధములుగా సంపాదింపబడిన ఆస్తులకు లేకపోవచ్చును. అవేవనగా ఏదేని ఆస్తి దానపఠా రీత్యా గాని, మరణ శాసనం ద్వారా గాని ఇతరములైన లిఖితముల ద్వారా గాని, లేదా సివిల్‌ కోర్టుచే పాస్‌ చేయబడిన డిక్రీ లేదా ఆర్డరు మూలముగా గాని లేదా పెద్దమనుషులచే ఇవ్వబడిన తీర్పు ద్వారా గాని సంపాదింపబడినచో ఆయా పత్రములలో పరిమిత హక్కు మాత్రమే ఇవ్వబడినచో ఆ పరిమిత హక్కే అమలు జరుగును గాని సర్వ హక్కులు రావు.
వ్యాఖ్య:

ఈ సెక్షన్‌ హందూ స్ర్తీల పాలిట వరప్రసాదము. ఈ హిందూ వారసత్వ చట్టము అమలులోకి వచ్చుటకు పూర్వము హిందూ స్ర్తీలకు వారి స్వాధీనములో ఉన్న దాన విక్రయ సత్వాది సర్వాధికారములు లేవు. 1937 సంవత్సరమునకు పూర్వము ఎవ్వడైన పురుషుడు తన తండ్రితోగాని, సోదరులతో గాని పంపకము చేసికొనకుండ నిస్సంతుగా అతడి భార్య మనోవర్తికి మాత్రమే సర్వ హక్కు కలిగి ఉండెడిది. ఒకవేళ అట్టి పురుషుడు వ్యష్టి అనగా పంపకం చేసికొని చనిపోయినచో అట్లు చనిపోయినవాని ఆస్తి అతడి భార్యకు ‘విడోస్‌ ఎస్టేట్‌ ((widow's estate) అను ఒక చిత్రమైన హక్కు ఉండెడిది. అట్టి ఆస్తిని ఆమె జీవితకాలంలో అనుభవించుటకు మాత్రం హక్కు కలిగి యుండెడిది. కొన్ని పరిస్థితులలో అట్లు సంక్రమించిన ఆస్తిలో కొంతభాగము విక్రయించు హక్కు కూడా ఉండెడిది. గతించిన తన భర్తకు పరలోక ప్రాప్తి కొరకు చేయు క్రియల నిమిత్తము, తీర్థయాత్రలకు వెళ్ళుట కొరకు కొంత భాగమును అమ్ముటకు అవకాశము ఉండెడిది.
1937 వ సంవత్సరములో వచ్చిన హిందూ స్ర్తీల ఆస్తి హక్కుల చట్టము (Hindu Women's Rights to property Act) కొన్ని మార్పులు చేసినది. ఏ హిందూ స్ర్తీ యొక్క భర్త అయినను తన భర్త వాటా ఆస్తిని పంచి పెట్టి తనకు స్వాధీనపరచమని కోరెడి హక్కును ఈ చట్టము ద్వారా సంక్రమింప చేసిరి. కాని ఆ విధముగా పొందబడిన ఆస్తి యందు అట్టి హిందూ స్ర్తీకి పరిమిత హక్కు మాత్రమే యుండెడిది.

ఈ హిందూ వారసత్వ చట్టము అమలులోకి వచ్చిన తరువాత హిందూ స్ర్తీలకు తమ స్వాధీనములో ఉన్న ఆస్తులకు దాన విక్రయ సత్వాది సమస్త హక్కులు వచ్చినవి.
తీర్పులు:

ఈ సెక్షన్‌పై సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులను ఇచ్చి యున్నవి. హిందూ స్ర్తీ యొక్క స్వాధీనములోనున్న అన్న పదమున కు అర్థమేమియో సుప్రీంకోర్టు మంగల్‌ సింగ్‌ కేసులో వివరించిం ది. ఈ తీర్పు AIR 1967 SC పేజీ 1786లో ప్రచురించబడింది. ఈ తీర్పు ప్రకారం హిందూ స్ర్తీకి ఆ ఆస్తి స్వాధీనములో లేకపోయినను ఆమె కు ఆస్తియందు హక్కు ఉన్న సందర్భమున ఆ హక్కు పురస్కరించుకొని స్వా ధీనము పొందే హక్కు కలిగియున్న యెడల సదరు ఆస్తి ఈ సెక్షన్‌ నిమిత్తము ఆమె స్వాధీనములో ఉన్నట్లే పరిగణించవలెను.
స్వాధీనము కలిగియుండుట (Possed of) అను పదమును విశాలమైన అ ర్థములో వాడినట్లును సంకుచిత దృష్టితో చూడరాదని, స్వాధీనము కలిగి యుండుటకు హక్కు కలిగియుండిన చాలునని తులసమ్మ Vs శేషారెడ్డి కేసు లో సుప్రీం కోర్టు అభిప్రాయము వెలిబుచ్చినది. ఈ కేసు 1977 (2) APLJ SC Page 14 ఆంధ్రప్రదేశ్‌ లా జర్నల్‌లో ప్రచురించబడినది. పైన వ్రాయబడిన సుప్రీంకోర్టు తీర్పు తులసమ్మ మనోవర్తికి సంబంధిం చినది. హిందూ స్ర్తీకి పంపకం ద్వారా లభ్యమైన ఆస్తి యందుగాని, మనోవర్తి కి ప్రత్యామ్నాయముగా పొందబడిన ఆస్తి యందుగాని, లేదా గత మనోవర్తి క్రింద ఇవ్వబడిన ఆస్తి యందుగాని ఆమెకు సంపూర్ణ హక్కులే ఉండును. పరిమిత హక్కు కాదు. ఇందులో (2) వ సబ్‌ సెక్షన్‌కు అర్థము చెప్పునప్పుడు ఈ సెక్షన్‌లోని (1) వ సబ్‌ సెక్షన్‌ ద్వారా ఈయబడిన హక్కును కోల్పోవునట్లు చెప్పరాదు.
AIR 1966 సుప్రీంకోర్టు పుజి 1879 ఎర్రమ్మ - వీరపన మధ్య వచ్చిన త గువులో సుప్రీంకోర్టు చట్టము యొక్క ముఖ్యోద్ధేశమును వివరించినది. వితంతు స్ర్తీలకు పూర్వము ఉండెడి జీవిత కాలపు అనుభవపు హక్కులు తుడిచి పెట్టి వేయుటకు ఈ 14 వ సెక్షన్‌ యొక్క ముఖ్యోద్ధేశము అని వివరముగా చెప్పినది.

ఈ సందర్భమున సుఖరాం - & another గౌరీశంకర్ల మధ్య వచ్చిన వివాద ములో సుప్రీంకోర్టు తన భర్త ద్వారా పొందబడిన ఆస్తిని అనుభవించుటలో గాని అమ్ముకొనుటకుగాని ఆ వితంతువుకు అడ్డులేని అధికారము కలదని అభిప్రాయము వెలిబుచ్చినది. (1968) 2 SC J 122 పుట.

ఈ చట్టము అములోనికి వచ్చేనాటికి తన భర్త ద్వారా పొందబడిన తన స్వాధీనానుభవములలో ఉన్న ఆస్తిని ఆ స్ర్తీ విల్లు ద్వారా ఇతరులకు సంక్ర మింపజేయవచ్చుననియు ఇందులో 14 (1) వ సబ్‌ సెక్షన్‌ వర్తించుననియు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చింతాల బుచ్చయ్య వగైరాలు మధ్య వచ్చిన తగవులో తీర్పు చెప్పినది. (1985) III APJ H.C 238 పుట వివరిస్తుంది.

అటులనే ఎన్‌.మహాలక్ష్మయ్య - కోమటిబసవమ్ము వగైరాల మధ్య తలయె త్తిన తగవులో కూడా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పై విధముగానే తీర్పు చెప్పినది. (1986) 1 APLJ H.C 186 పుట.

ఇటువంటివాటికి 14వ సెక్షన్‌లోని 2వ సబ్‌సెక్షన్‌ వర్తించదు

ఆదర్శ మహిళలు - దుర్గా బాయి దేశ ముఖ్

ఆదర్శ మహిళలు 










.

దేశ స్వాతంత్రోద్యమంలో ఎందరో ఆంధ్ర మహిళలు పాల్గొన్నారు. వారిలో డా|| దుర్గా బాయి దేశ్‌ముఖ్‌ ప్రముఖులు. ఈమె పేరు గాని ఆమె స్థాపించిన ఆంధ్ర మహిళా సభ పేరు గాని తెలియని వారు ఆంధ్ర ప్రదేశ్‌ లో ఉండరేమో, అతి చిన్న వయసులోనే గాంధీజీ ప్రభావం ఈమెపై పడింది. బాలికగా వున్నప్పుడే జాతీయోద్యమం కోసం తన బంగారు గాజులను ఇచ్చివేసింది. ఎన్నో సందర్బాలలో గాంధీజీ ఆమె ఉదారత్వానికి పరవశించి ఒక చిరువునవ్వుతో ఆమె హృదయంపై చెరగని ముద్ర వేసి ఆమె జీవితానికి ఒక స్ఫూర్తినిచారు.
బాపూజీకి ప్రియ శిష్యులైన దుర్గా బాయి 1909 జులై 15వ తేదీన రాజమండ్రి లో జన్మించారు. దుర్గా బాయి ప్రతిభ బాల్యంలోనే వెల్లువిరిసింది. హిందీలో పాండిత్యం గడించింది. ఆమె కాకినాడలో హిందీ పాఠశాలను పెట్టి చాలా మంది మహిళలకు హిందీ భాషను నేర్పించారు. దుర్గా బాయి రంగవల్లుల్లు వేయటంలో ఆమెకు ఆమే సాటి. వీణావాదనలో దిట్ట అనిపించుకొన్నది. స్త్రీ సాంఘీక సంక్షేమ సంస్థ సహకారంతో ఆంధ్ర మహిళా సేవా కేంద్రాలను మద్రాసులోను, హైద్రాబాదులోను ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లల్లోనూ స్థాపించి ఎందరో మహిళలకు ఆశాదీపాలుగా వెలుగుబాట చూపించాయి. స్త్రీ వయోజన విద్యకు ఈ సంస్థ ద్వారా బాట వేసింది.
కందుకూరి వీరేశలింగం పంతులు, మహర్షి వెంకటరత్నం నాయుడు గార్ల ఉద్బోథలతో ఆమె సాంఘిక దురాచారాలను రూపు మాపడానికి స్త్రీలలో చైతన్యం కలుగ చేయడానికి ఎంతో కృషి చేసింది. వితంతువుల యెడల చూపబడుతున్న నిరాదరణ వ్యతిరేకించేది. ఎంతోమంది దిక్కులేని అనాధ స్త్రీలకు ఆర్ధికంగా తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు సహాయం చేసింది.
1927 లో గాంధీజీ కోటి రూపాయల నిధి సేకరణ చేస్తూ ఆంధ్ర పర్యటన కు వచ్చారు. రాజమండ్రి సమీపంలోని సీతానగరం ఆశ్రమంలో బసచేశారు. ఆకాలంలో భోగం మేళాలు ఎక్కువగా ఉండేవి. దేవదాసీల జీవితం దుర్భరంగా ఉండేది. వారేకాక ముస్లిం మహిళలు కూడా సంప్రదాయాలకు బానిసలై బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండేవారు. వారికో వెలుగు చూపాలని నిశ్చయించింది. దుర్గా బాయి స్త్రీల కోసం ప్రత్యేక సభ ఏర్పాటు చేసి, ఏ సభలో గాంధీజీ గారిచే ఉపన్యాసం ఇప్పించాలనుకున్నది. కాంగ్రేస్‌ నాయకులైన బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య గార్ల వద్దకు వెళ్ళి దుర్గాబాయి తన కోర్కెను వెళ్ళడించింది. అప్పుడు ‘అయిదువేల నిధి సమర్పిస్తే , గాంధీగారిని అయిదు నిమిషాలు మాట్లాడమని చెబుతాం ’ అని బులుసు సాంబమూర్తిగారు అన్నారు. వారం రోజుల్లో అయిదు వేల రూహాయలు వసూలు చేసి ‘అయ్యా! ఇదిగో అయిదువేలు - కార్యక్రమాలు ఏర్పాటు చేయండి’ అన్నది దుర్గాబాయి.
అయిదు నిమిషాలంటూ ఉహన్యాసం ప్రారంభించిన గాంధీజీ గంట సేపు మాట్లాడారు. బీదల కోసం డబ్బులివ్వండి’ అన్నారు. మహిళలు తమ గాజులు, ఒంటిమీద ఆభరణాలు తీసి ఇచ్చారు. దుర్గాబాయి అయిదువేల నిధి సమర్పించింది. సభలోని మహిళలిచ్చిన ఆ నగలు, నగదు పాతిక వేలు మించింది. గాంధీజీ దుర్గాబాయి ని తన కారులో కూర్చోమన్నారు. ఆయన దుర్గాబాయిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆంధ్ర పర్యటన ఆంతా దుర్గాబాయి, అనువాదకురాలుగా సాగింది. మద్రాసులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో ఆమె నాయకురాలు. రెండేళ్ళ జైలు శిక్ష తర్వాత విడుదలయ్యారు.
పట్టుదలకు ప్రతీక దుర్గాబాయి. ప్రైవేటుగా బెనారస్‌ యూనివర్శిటీ నుండీ మెటిక్యులేషన్‌పాసై, అక్కడే ఇంతర్మీడియట్‍పాసయ్యారు. అక్కడే బి.ఏ. (ఆనర్స్‌ ) చదవడానికి వీలు కాలేదు. వాల్టేరు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలని, వైస్ ఛాన్స్‌లర్ డా.సి. ఆర్.రెడ్డిగారిని కలుసుకున్నారు. మహిళలకు ప్రత్యేకంగా హాస్టల్ లేనందున వీలు కాదన్నారు. పది మంది మహిళల అప్లికేషన్లు అందించి మరల అభ్యర్ధించగా డా|| రెడ్డిగారు అనిమతించారు. దుర్గాబాయి బి.ఏ. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు లా కాలేజీలో బి.ఎల్.పట్టా పుచుకున్నారు. సివిల్ మరియు క్రిమినల్ కేసులను చేపట్టి, బాగా పేరు సంపాదించారు. ఆమె మద్రాసులో ప్రాక్టీసు చేస్తూ, ఆమె ఆంధ్ర మహిళా సభ భవన నిర్మాణానికి పూనుకున్నారు. కస్తూరిబానిధికి వేలాది రూపాయలు వసూలు చేసి గాంధీజీకి ఇచ్చారు.
ఆమె ప్రతిభా సమర్ధ్యాలను గుర్తించిన నాయకులు ఆమెను రాజ్యాంగ సభ సభ్యులుగా ఎన్నుకున్నారు. డాక్టర్ అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బి.ఎన్.రావు వంటి ఉద్దండులతో కనిసి ప్రాధమిక హక్కులు, స్త్రీలకు ఆస్తి హక్కు మున్నగు అంశాలను రాజ్యాంగంలో చేర్పించారు.
1950 తర్వాత ఆమె సాంఘిక సేవారంగంలో ప్రవేశించారు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుగారు గారు పాతికవేల రూపాయల చెక్కు ఇచ్చి రాయల సీమలో క్షామ నివారణ పథకాల పర్యవేక్షణకు పంపారు.1952 లో దుర్గాబాయి ని ప్లానింగ్ కమీషన్ మెంబరుగా ప్రభుత్వం నియమించింది. 1953లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ గా వుంటూ పదేళ్ళూ పని చేశారు. ఆ సమయం లోనే మహా మేధావి, కేంద్ర, ఆర్ధిక శాఖ మంత్రి డాక్టర్ చింతామణి దేశ్‌ముఖ్ గారిని పెళ్ళాడారు.
కేంద్ర సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఆమె అవిశ్రాంతంగా కృషి చెశారు. 1957 లో డా||దేశ్‌ముఖ్‌ ఆర్ధిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి యూనివర్శిటీ గ్రాంట్‌ కమీషన్ చైర్మన్ గా నెలకు ఒక రూపాయి వేతనంలో మూడేళ్ళు పనిచేశారు. 1967 లో దేశ్‌ముఖ్ దంపతులు డిల్లీ వదలి హైదరాబాదులో స్థిరపడినారు. తమ ఇంటికి ‘రచన’ అని పేరు పెట్టుకున్నారు.
ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాలు మూడు పూవులు ఆరుకాయలుగా విస్తరించాయి. నర్శింగ్ హోమ్, ఆర్ధోపెడిక్ సెంటర్, శిశు విహార్, నర్స్‌స్ హాస్టల్ మరెన్నో వైద్యశాల భవనాలు ఏమె సేకరించిన విరాళాలతో వెలిశాయి. దాదాపు 23 సంస్థలకు ఆమె మూలకారకురాలు.
దేశ ముఖ్ దంపతులు తమ ఆస్తిపాస్తులన్నింటినీ సేవా సంస్థల స్థాపనకు విరాళంగా ఇచ్చారు. 26 ఏళ్ళ దాంపత్య జీవితం సేవామయంగా సాగింది. నిరంతర శ్రమ, కార్య దీక్ష పట్టుదల నిజాయితీ అన్నీ మూర్తీభవించిన మహిళా మణి దుర్గాబాయి.
1971లో ఆమె వయోజన విద్యావ్యాప్తికి చేసిన కృషికి భారత ప్రభుత్వం ‘నెహ్రు నిటరసీ’ అవార్డు ఇచ్చి సత్కరించింది. 1975 జనవరి 26 న ఆమెను ‘పద్మ విభూషణ’తో ప్రభుత్వం సత్కరించింది. లాయరుగా జమిందారుల కేసులన్నీ కోర్టులో వాదించి గెలిచి వారి నుంచి తీసుకున్న ఫీజుల మొత్తమును ఆంధ్ర మహిళా సభకు ఈచ్చిన త్యాగమూర్తి శ్రీమతి దుర్గాబాయి.
స్వతంత్ర పత్రికలో ఖాసా సుబ్బారావుగారు ఆమె గురించి “దుర్గాబాయి విసుగు విరామం లేని మనిషి, తన సహచరులను కూడా తనలాగే విరామ మెరుగని సేవాతత్పరులుగా ఆవేశ పూరితులుగా చేయగల నాయకురాలామె. జీవితంలో ఓటమి వుంటుందేమో అన్న భయం ఆమెకు లేదు.... సహారా ఎడారి లో కూడా ఆమెకు చేయడానికి ఏదో సేవా కార్యక్రమం కనిపిస్తుంది.” ఆని రాశారు.
ఈమె ఆంధ్ర మహిళ అను పత్రికను నిర్వహించింది. తరువాత దానిని విజయదుర్గా అనే పేరుతో ఆంగ్లముతో, తెలుగు లో ప్రచురింపబడింది ఆమె ‘దిస్టోన్ - దట్‌ స్పీక్స్’ అనే పుస్తకంలో ఆంధ్ర మహిళా సభ చరిత్ర యావత్తు పొందుపరచింది. ప్రేమ్‌చంద్ కధలను తెలుగులోకి అనువదించింది. ‘చింతామణి మరియు నేను’ అనే ఆత్మ కధను రచించింది. ఆమె రచించిన “భారతంలో సాంఘీక సంక్షేమం” అమూల్య గ్రంధముగా ఎందరో నేటికి భావిస్తారు. దేశ భక్తురాలిగా, స్వాతంత్ర్యసమర యోధు రాలిగా ,సంఘసంస్కర్తగా, సంఘ సేవకురాలిగా, రచయిత్రిగా, బహుముఖ ప్రఙ్ఞావంతురాలిగా గుర్తింపు పొందిన వ్యక్తి, ఎన్నో జీవితాలకు వెలుగు చూపిన వ్యక్తి 1981 మే 9 వ తేదీన పరమపదించారు. నేటి మహిళలకు ఈమె గొప్ప స్ఫూర్తినిచ్చే ఆదర్శ మహిణగా చరిత్ర లో నిలిచిపోయింది.

పర్సనల్ ఫైనాన్స్








.


                       రిటైరైన తరువాత బతుకుబండిని లాగడం ఎలాగా అని చాలామంది ఆందోళన చెందుతారు. ముందుచూపు గలవారు మ్యూచువల్ lఫండ్స్ లో నెలనెలా ఇన్వెస్ట్ చేయడం, బ్యాంకు ఆర్ డి లు కట్టుకోవడం, SIP ల్లో , ఫించను పథకాలలో ఇన్వెస్ట్ చేయడం , తగినన్ని బీమా పాలసీలు తీసుకోవడంలాంటి చర్యలు చాలా ముందే చేపడతారు. అయితే వీటన్నిటి కంటే భిన్నంగా అటు నెలనెలా కొంత రాబడిని ఇస్తూ మరోవైపు పెట్టుబడి విలువ పెరుగుతూ ఆర్థిక స్థోమతను ఇచ్చే మరో ఉపాయం వుంది. అదేమిటో ఈ పాటికే అర్థమై వుంటుంది. నివాస గృహానికి తోడు సంపాదనలో వున్నప్పుడే మరో ఇల్లు కొంటే ఇక జీవితం నిశ్చింతగా గడుస్తుందని చెప్పవచ్చు. ఈ సూత్రాన్ని పాటించిన రిటైర్డ్ ఉద్యోగులు ఎందరో హాయిగా ప్రశాంతంగా గడుపుతున్నారు.
                ఉదాహరణకు సుబ్బారావు అనే మధ్య తరగతి ఉద్యోగి నెలకు 25 వేలు జీతం సంపాదిస్తున్నాడు. అద్దె ఇళ్ళల్లో ఇమడలేక అతని భార్య నెలకు రెండుసార్లు పుట్టింటికి వెళుతోంది. కష్టపడి పొదుపు చేసిన సొమ్ము, బోనస్ , ఎరియర్స్ వగైరా అన్నీ కలిపితే రెండు లక్షల రూపాయలు సుబ్బారావు దగ్గర వున్నాయి. ఇంటి అద్దె రూ 4 వేలు చెలిస్తూ నెలసరి అన్ని ఖర్చులు పోను నెలకు 5 వేల రూపాయలు పొదుపు చేస్తున్నాడు. ఓ ఫ్రెండ్ సలహామీద ఇల్లు కొనాలనే ఆలోచనరాగానే ప్రయత్నాలు ప్రారంభించాడు. నగర శివార్లలో మంచి ఇల్లు 11 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. డౌన్ పేమెంట్ 2 లక్షలు చెల్లించి బ్యాంకు లోన్ మీద ఇల్లు సొంత చేసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యాడు. నెలసరి బ్యాంకు వారికి చెల్లించాల్సిన EMI రూ 8,100 లుగా తేలింది. ఇంతకు ముందు చెల్లిస్తున్న ఇంటి అద్దె 4 వేలు, నెలసరి పొదుపు చేస్తున్న 5 వేలు కలిపితే EMI చెల్లించడం సుబ్బారావుకు సమస్యకాలేదు. ఇప్పుడు సొంత ఇంట్లో , అదీ సరికొత్త ఇంట్లో సుబ్బారావు సంతోషంగా వుంటున్నాడు. ఇంటి రుణం మీద పన్ను రాయితీ కూడా పొందుతున్నాడు. ఇంటి అద్దె పెరుగుతుందనే భయం ఆతనికి ఇప్పుడు లేనే లేదు. పైగా 20 ఏళ్ళ లోన్ పీరియడ్ అనంతరం ఇంటి విలువ ఎంత లేదన్నా 50 లక్షల రూపాయలుంటుంధన్న ఆర్థిక భరోసా మరీ ధైరాన్నిస్తోంది.
                     మరో ఉదహరణలో గోపాల్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి సొంత ఇల్లుంది. అయితే మంచి పెట్టుబడి సాధనంగా నివాస గృహాలు కొనడమే మంచిదని అతనికి మొదటి నుంచీ నమ్మకం. మిగతా ఏ పెట్టుబడి పథకాన్ని అతను ఒప్పుకోడు. నెలజీతం 60 వేలలో ఇంటి అవసరాలకు పోను సుమారు 15 వేలు పొదుపు చేస్తాడు. ఇ టీవల బ్యాంకు లోన్ తీసుకొని 26 లక్షల రూపాయల ఫ్లాట్ కొన్నాడు. డౌన్ పేమెంట్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. నెలసరి EMI 18 వేల రూపాయలు చెల్లించడానికి కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది తలెత్త లేదు. నెలవారీ పొదుపు చేస్తున్న 15 వేలకు తోడు ఫ్లాట్ మీద వచ్చే 5 వేల రుపాయల అద్దె EMI చెల్లింపును సులభం చేసింది. పన్ను రాయితీ కూడా లభించింది. ఆర్థికంగా భద్రతనిచ్చే స్థిరాస్తి సమకూరింది.
                   అయితే నివాస గృహాలపై పెట్తుబడి పెట్టడం అనేది అందరికీ నచ్చకపోవచ్చు. మంచి టెనెంట్స్ దొరకరని, అద్దె సక్రమంగా చెల్లించరని, ఎప్పటికప్పుడు మారిపోయే  నిబంధనలు తలనొప్పి కలిగిస్తాయని కొందరు ఈ ఐడియాని ఒప్పుకోరు. అలాగే వయసు ఎక్కువగా వున్న ఉద్యోగులకు కూడా ఈ పెట్టుబడి సాధనం సరిపడదు. దీర్ఘకాలం అంటే 15 లేదా 20 సంవత్సరాలుండే గృహ రుణాల వ్యవధి వరకు సర్వీసులో వుండే వారికే గృహాల కొనుగోలు ఓ పెట్టుబడి మార్గంగా పనికొస్తుంది.

అతి సార వ్యాధి

అతి సార వ్యాధి -  సాధారణంగా చిన్న పిల్లలకు వచేవ్యది ల లో అతి సార వ్యాధి ముఖ్యమైనది. సాధారణంగా ఈ వ్యాధి 5 స౦" లోపు పిల్లలకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోజు కనీసము మూడు నాలుగు సార్లు విరోచనము నీరు గా కావడాన్ని అతిసార వ్యాధి అంటారు  చిన్న పిల్లలో ఒకేసారి ఎక్కువ నీటి విరోచానంయన ఈ వ్యాధి క్రిందే లెక్క . వీటి లో చాల రకాలు వున్నవి డయేరియ అనగా నీటి విరోచనాలు ,డీసెంట్రి  ( రక్త విరోచనాలు ) . 
డిహైడ్రేషన్ వలన ఆహరలోపాలవలన ఇవి కూడా కారణాలు .
ఈ వ్యాధి మీద మనకి సరి అయిన అవగాహన లేననందున చాల అనర్ధాలకు దారి తీస్తుంది . కావున డాక్టర్ ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడము మంచిది .

రామనవమి-వ్యాసము


                                రామాయ రామభద్రాయ రామచంద్రయ వేధసే
                               రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః
                                   









రామనవమి


శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


చరిత్ర

రామాయణం లో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర,కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే భాద్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్ర కు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్యకు రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. [1][2]

రామ రాజ్యం

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైక కు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

"ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కధ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు.. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium).



షాపింగ్ చేయడం ఓ నేర్పు







షాపింగ్ చేయడం ఓ నేర్పు


ఒక వెయ్యి మంది స్ర్తిలపై రీసెర్చి చేసి ఈ క్రింది విషయాలు కనుగొన్నారు. 15 నుంచి 64 ఏళ్ళ వయసు స్ర్తిల అభిప్రాయాలు సేకరించారు. 75% మంది రిటైల్ షాపింగ్ వారికి థెరపీలా ఉపయోగపడ్తుంది. కొన్నా కొనకపోయినా అలా షాప్స్‌ని చూస్తూ వెళ్ళటంలో ఒక ఆనందం, థ్రిల్, కాసేపు బాధల్ని మర్చిపోతున్నారు. వెళ్ళాక కొనాలనే రూలు లేదుగా! విండో షాపింగ్ ఆహ్లాదాన్ని ఇస్తుంది. బుర్రలో కొత్త ఆలోచన్లు కల్గిస్తుంది. స్ర్తిలు ఎక్కువ కాలం జీవించడానికి కారణం వారు ఎక్కువగా షాపింగ్ చేయటమే సుమా! షాపుల వెంటే నడవడంతో వ్యాయామం, ఖరీదులు, వాటి లాభనష్టాలు బేరీజు వేయటంలో బుర్ర చురుగ్గా ఉంటుంది. పాజిటివ్ భావాలు వెల్లడౌతాయి. సీజన్స్ మారినప్పుడల్లా వాటి ప్రభావం మనపై పడ్తుంది. ఆ స్ట్రెస్, విసుగు పోగొట్టడానికి చిట్టి చిట్కా షాపింగే సుమా! మనకు తెల్సిన ఏన్నో ఏళ్ళ క్రితం వ్యక్తులు కన్పడి సంభ్రమాస్చర్యాలు కల్గిచేసే ఛాన్స్ ఈ షాపింగ్‌లోనే దొరుకుతుంది.
షాపింగ్ డిస్ ఆర్డర్ ఉన్న వ్యక్తి అనవసర చెత్త కొని ఇల్లంతా నింపేస్తాడు. అమెరికాలో 8% మంది ఈ రోగం బారిన పడ్తున్నారు. ఇందులో స్ర్తిలే ఎక్కువ. షాపింగ్ చేశాక రిలాక్స్ అవుతారు. విపరీతంగా ప్రేమించి ద్వేషించేవారే ఈ రోగానికి గురి అవుతారు. జేబులో డబ్బు ఖాలీ అయ్యేదాకా నిద్రపట్టదు వారికి. తన ఫ్రెండ్ కొన్న చీరె, గాజులపై మచ్చుట పడ్డ స్ర్తిలు అంతకన్నా గొప్పవి కొని, ఆమెని అధిగమించాలనే ప్రయత్నం చేస్తుందిట. పోటీతత్వం అవతలి వారికన్నా నేనే గొప్ప అనిపించుకోవాలనే తపన ఈ రోగం ఉన్న స్ర్తిలలో ఎక్కువ. అవసరం ఉన్నా లేకున్నా ఇంటినిండా సామాన్లు, బీర్వా నిండి చీరెలు కన్పడాలి వారికి. ఇలాంటి వారికి కౌనె్సలింగ్ చేయిటం ముఖ్యం. షాపింగ్‌తో పొద్దుపుచ్చక, ఏదన్నా హాబీ, వ్యాపకం ఏర్పర్చుకోవాలి.
షాపింగ్ చేయటం ఒక నేర్పు... కళ కూడా..! మరి నేటి స్మార్ట్ స్ర్తి ఎంత స్మార్ట్‌గా తెలివిగా షాపింగ్ చేస్తుందో తెలుసా? మరి దానికి కొన్ని 20ఔటిప్స్ ఉన్నాయి.
హెడ్ ప్రొడక్ట్సు అంటే షాంపూ, హేర్ కలర్, డై, జెల్ తల నూనె కొనేప్పుడు మంచి కంపెనీవి ఖరీదెక్కువైనా సరే తీసుకోవాలి. మనతల జుట్టు జిడ్డురకందా, ఎండినట్లుండేదా, సామాన్యమైనదా అనే దాన్ని బట్టి షాంపూని కొనాలి. హేర్ ఎక్సెసరీస్ అంటే డ్రైయర్, రోలర్, హేర్ క్లిప్స్‌ని వాటి డ్యూరబిల్టీని చూడాలి. కుంకం, తిలకం క్వాలిటీవి కాకపోతే చర్మ రోగాలు వస్తాయి. ఇక దుస్తుల ఎన్నికలో ఫ్యాషన్ కన్నా శరీరానికి సుఖంగా సౌకర్యంగా ఉండేవి సెలక్టు చేసుకోవాలి. సీజన్‌ని బట్టి ఫ్యాబ్రిక్‌ని సెలక్టు చేసుకోవాలి. రంగువైతే కొద్దిగా తడిపితే అది రంగు వెలుస్తుందో లేదో తెల్సిపోతుంది. బట్టపై రాసిన వాష్ ఇన్‌స్ట్రక్షన్స్ చదివాకే ఉతకాలి. ఇక ఎవరికైనా మనం గిఫ్ట్‌గా డ్రెస్సు ఇవ్వాలనుకుంటే వారి రంగు, రూపం, వయసు, అభిరుచి బట్టి సెలక్టు చేయాలి. ఇక లోదుస్తులు కొనేప్పుడు సైజు, క్వాలిటీ చూడాలి. ఇక ఫుట్‌వేర్ కాలికి శ్రమ కల్గించేలా ఉండకూడదు. మన ప్రొఫెషన్‌ని బట్టి కాలిజోళ్ళు కొనాలి. లెదర్‌వి అయితే క్వాలిటీ చూసి డ్రెస్సుతో మ్యాచ్ అయ్యేవి కొనాలి. హైహీల్స్ వల్ల ఆరోగ్యానికి భంగం కలగవచ్చు. ఇక ఎక్సెసరీస్ ఎలా ఉండాలి? సరియైన మెటీరియల్ మన అవసరానికి తగ్గ హాండ్ బాగ్స్ కొనాలి. బట్టతో చేసినవి త్వరగా మాసిపోతాయి. అందుకే లెదర్, రెగ్జిన్‌వి కొనాలి. ఇక కంటి మేకప్‌పై మంచి క్వాలిటీ కాటుక, మస్కరా, ఇ-లైనర్, ఇషాడో అన్ని మంచి కంపెనీలవి కొనాలి. ఎక్స్‌పైరీ డేట్ తప్పక చెక్ చేయకపోతే అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. అందం కన్నా కంటిచూపు ముఖ్యం కదా! ఫౌండేషన్స్, లిఫ్‌స్టిక్, లిఫ్ గ్లాస్, ఫేస్ పౌండర్ అన్నీ చర్మంపై పరీక్షించాకే కొనాలి.
ఇక షాపింగ్ కెళ్ళేప్పుడు కొన్ని చిట్టి చిట్కాలు పాటించాలి. బాగా రష్‌గా ఉండే టైంలో, పండగ సీజన్స్‌లో వెళ్ళగూడదు. తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు పాడైతే కన్‌స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. ఒకే షాపులో కొంటుంటే రెగ్యులర్ కస్టమర్‌గా డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ చేయటం కూడా తేలిక. మనం అభిరుచుల్ని బట్టి షాపువారు సరుకు ప్రత్యేకంగానైనా తెప్పించి ఇస్తారు. ఇతరుల్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వస్తువుల్ని అనవసరంగా కొనరాదు.

వేసవి-చిట్కాలు







వేసవి FASHION -సమ్మర్ కదా అని FASHION లేక పోతే ఎలా అని ఫీల్ అవ్వకర్లేదు ఎందుకంటె మార్కెట్ నిండా సమ్మర్ ఫ్యాషన్లే , లినెన్, కాట్టన్ మెటిరియల్తో చమట పీల్చి గాలి ఆడేలా రూపొందించిన తేలికైన దుస్తులు లో ఎన్నోరకాలు స్కర్టులు ,సార్టులు, క్యాప్రిలు , స్లీవ్లేస్స్ ,స్పాగటి టాప్ లు  వేసవి కి అనుకూలము . డెనిం జీన్స్ ,కాట్టన్ షర్ట్స్ కూడా మంచిదే అల్లాగే తెలుపు లైట్ కలర్స్ చాలా హయిగా వుంటై .
మరియొక విషయము వేసవి లో నగలు ధరించక పోవడము మంచిది వేసవి లో ముత్యాలు నగలు మంచిది .
మరొక విషయము ఎండలో తిరగడము వలన జుట్టు దెబ్బతింటుంది కాబటి ఆల్కహాలు ,ఫార్మల్దిహైడ్ శాతాలు ఉన్నషాంపూలు కండిస్నార్లు ఈ కాలము వాడకున్దవుంటే మంచిది .

మగువ పాదాల అందాలను పెంచే లేటెస్ట్ శాండల్స్

                                           మగువ పాదాల అందాలను పెంచే లేటెస్ట్ శాండల్స్



                        







అబ్బా ఆ అమ్మాయి నడక చూడండి ఎంత వయ్యారంగా ఉందో. అమ్మాయి అంటే అలా నడవాలి అనే మాటలను మనం వింటూనే ఉంటాం. అయితే నడిచే తీరు వేసుకునే చెప్పులను బట్టి కూడా ఆ అందం మరింత ఇనుమడిస్తుంది. ఒకప్పుడు కేవలం పాద రక్షణకు మాత్రమే వాడే చెప్పులు ఇప్పుడు ఫ్యాషన్ కి సింబల్ గా మారాయి. మార్కెట్లో శాండల్స్, ప్లేట్స్, హీల్స్ ఇలా ఎన్నో రకాల పేర్లతో మగువల మదిని దోస్తున్నాయి. కొన్ని రకాల దుస్తులు ధరించినపుడు వాటికీ తగిన శాండల్స్ ధరించడమనేది నేటి ట్రెండ్. ఆ ట్రెండ్ కు తగినట్లే మార్కెట్ వర్గాలు వివిధ రంగులు, డిజైన్లతో పాదరక్షలను ప్రవేశపెడుతున్నాయి. మహిళలు సైతం తమ అభిరుచికి తగినట్లుగానే పాదరక్షలను ఎంచుకుంటున్నారు. అందానికి అందం, ఫ్యాషన్ కి ఫ్యాషన్, నడకలో హుందా తనాన్ని, వయ్యరాన్ని ఇనుమడింప చేసే ఈ పాదరక్షలు అందం మాత్రమే కదండీ.... వాటి ధరలు కూడా ఆదరగోడుతున్నాయి.
మగువల పాదరక్షలు :
బలెట్స్:ఈ రకం చెప్పులు డెనిమ్ స్కర్టులు లేదా పొట్టి స్కర్టులు, మోకాళ్ళ వరకూ వుండే డ్రెస్ తో పాటు వేసుకుంటే బాగుంటాయి. సల్వార్ - కుర్తాలతో పాటు ధరించకూడదు
టేపరింగ్ హీల్స్ :ఇవి పొట్టి స్కర్టులు, కాఫ్ లెంగ్త్ స్కర్ట్ లు లేదా డ్రెస్లు కుర్తాలు, పూల ప్రింట్ల దుస్తులతో పాటు వేసుకుంటే బాగుంటాయి. స్కిన్నీ జీన్స్ ధరించినపుడు మాత్రం హాయ్ హీల్స్ చెప్పులు వేసుకోవద్దు.
చెప్పల్స్ :వీటిని కుర్తీలు, ఎత్నిక్ టాప్స్ పొడవైన కుచ్చిళ్ళు జీరాడే స్కర్ట్ లతో పాటు వేసుకుంటే బాగుంటుంది. ట్రౌజర్లు, చొక్కాతో ధరించినప్పుడు మాత్రం ఇవి వేసుకోవద్దు.
మొజ్రీస్ :వీటిని కుర్తీలు, ఎత్నిక్ టాప్ లు ధరించినప్పుడు వేసుకోవాలి. జీన్స్క్ష్, కేప్రీస్, వెస్ట్రన్ స్కర్ట్ లు ధరించినపుడు మాత్రం వేయకూడదు.
స్నీకర్స్ :ఇవి వేటితో బాగుంటాయంటే జీన్స్, కర్గోస్, పోట్టి డెనిమ్ స్కర్ట్ లతో కుర్తాలు, లాగ్ స్కర్ట్ లతో పాటు స్నీకార్స్ వేసుకోవద్దు.
స్టిలేటోస్:అనబడే ఎత్తు మడాల చెప్పులను స్కర్ట్ లు, ఇతర డ్రెస్ లు, కుర్తాలతో పాటు వేసుకుంటే బాగుంటాయి. డెనిమ్, కేప్రీస్ కార్గోస్ తో బాగుండవు.
బూట్లు :బిగుతిన్, చక్కగా ఫైట్ అయిన స్కర్ట్స్, డ్రెస్ లు, జీన్స్ టో పాటు వీటిని వేసుకోవాలి. భారతీయ దుస్తులతో వీటిని ధరించకూడదు.

పర్సనల్ ఫైనాన్స్












ATM సీక్రెట్స్...
ATM... ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ వినియోగం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ ఏటీఎంలను బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ ఏటీఎం వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఒకసారి చూద్దాం...

ఏటీఎం కార్డును మీరు వినియోగించే సమయంలో చుట్టుపక్కల వారెవ్వరూ మీ పిన్ నెంబరును గమనించకుండా జాగ్రత్త వహించాలి. కార్డు నెంబరు, పిన్ నెంబరు ఏ సందర్భంలోనూ ఇతర వ్యక్తులకు వెల్లడించవద్దు.

కొన్ని ఏటీఎంలలో ట్రాన్సాక్షన్ జరిపేందుకు ఏటీఎంలోని స్లాట్‌లో కార్డును ఇన్సర్ట్ చేయాలి. కొన్ని మిషన్లలో స్వాప్ చేస్తే సరిపోతుంది. అటువంటి సమయాలలో దాని కంప్యూటర్ స్క్రీన్‌పైన వచ్చే సూచనలు జాగ్రత్తగా గమనించాలి. తరచుగా ట్రాన్సాక్షన్ పూర్తి కాగానే " డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్దర్" అనే ప్రశ్న స్క్రీన్‌పై కనిపిస్తుంది. మరొక ట్రాన్సాక్షన్ అవసరం లేనప్పుడు నో బటన్‌పై క్లిక్ చేస్తే మీ పని పూర్తవుతుంది.

షాపింగ్ వేళల్లో కార్డు మీ దృష్టిపథంలోనే ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల కార్డు ఏ సందర్భంలోనూ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఏటీఎం కార్డు వెనుకవైపు కార్డు వెరిఫికేషన్ వేల్యూ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరును మీరు ఒకచోట రాసి భద్రపరుచుకోవాలి. ఈ నెంబరు కూడా ఇతరలకు తెలియనివ్వకూడదు. ఈ నెంబరు చాలా ముఖ్యమైనది. ఈ నెంబరు మీవద్ద వుంటే కార్డు లేకున్నా ఏ ఇంటర్నెట్ నుంచైనా షాపింగ్ చేసుకునే వీలుంది.

ఏటీఎం కార్డు పోయినట్లయితే...?
ఏటీఎం కార్డు పోగొట్టుకున్నప్పుడు వెంటనే ఏటీఎం కార్డును జారీ చేసిన బ్యాంక్‌కు ఆ సమాచారం అందించాలి. ఇందుకోసం కాల్ సెంటర్‌లో కంప్లైంట్ నమోదు చేసుకుని కంప్లైంట్ నెంబరును నోట్ చేసుకోవాలి. మీ కంప్లైంట్ అందగానే బ్యాంక్ మీ ఏటీఎం నెంబరును బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత మీ కంప్లైంట్ నెంబర్ ఉదహరిస్తూ మీ ప్రాంత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయించుకోవాలి.

మీకు తెలియకుండా ఎవరైనా మీ ఏటీఎం కార్డును వినియోగిస్తే...
మీ అనుమతిలేని వ్యక్తి కార్డును ఉపయోగిస్తూ శిక్షార్హుడవుతాడు.

మీ కంప్లైంట్ బ్యాంకు పట్టించుకోకపోతే...
ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు కంప్లైంట్ నమోదు చేసుకోవడంలో బ్యాంకు తప్పించుకోవాలని చూసినా వినియోగదారుడు కన్స్యూమర్ చట్టం కింద బ్యాంక్‌పై కేసు పెట్టవచ్చు. బ్యాంక్ సేవల్లో లోపానికి ఈ కేసును నడపవచ్చు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్‌కు మీరు ఇచ్చిన కంప్లైంట్ నకలు మీవద్ద ఉంచుకోవాలి. ఈ వ్యవహారంలో వినియోగదారునికి మానసిక, శారీరక వేదన కలిగించినందుకు జిల్లా వినియోగదారుల న్యాయస్థానం బాధితునికి రూ. 25వేల వరకూ నష్టపరిహారంతోపాటు కోర్టు ఖర్చులను కూడా ఆ వ్యక్తి ఇవ్వవలసిందని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేయవచ్చు.

విద్యార్దులు వారి కెరీర్








                                   ప్రవేశ పరీక్షలకు తొలి మెట్టు


ఉన్నత కోర్సులైన డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ వంటి కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నేటి విద్యార్ధులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రంగాల్లో ప్రవేశించేందుకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి. ఈ విషయంలో విద్యార్ధులు ఒకింత ఒత్తిడికి గురికావడం సహజం. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్, ఐఐటీ తదితర ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించి తమకిష్టమైన రంగాల్లోకి ప్రవేశించేందుకు బాటలు వేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం విద్యార్థులు ఖచ్చితంగా పాఠ్యాంశాల అభ్యాసం, సమయపాలనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంది.
సాధారణంగా ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కాని ప్రవేశ పరీక్షల్లో మాత్రం ఊహించని విధంగా అతి స్వల్ప మార్కులు మాత్రమే సాధిస్తారు. దీనికి ప్రిపరేషన్‌లోని లోపమే ప్రధాన కారణం. తాము ఎన్నుకున్న సబ్జెక్టుపై పట్టు లేకపోవడంతో పాటు.. సమగ్ర విశ్లేషణా లోపం వల్ల తక్కువ మార్కులు రావడం జరుగుతోంది.
ఒక ప్రశ్నకు సంబంధించిన అంశాన్ని ఎన్ని రకాలుగా అడిగినా... దానికి సమాధానం చెప్పగలిగే సామర్థ్యం, పూర్తి విశ్లేషణ విద్యార్ధులు ఎంచుకున్న సబ్జెక్టుపై ఉండాలి. ఇంటర్మీడియట్‌లో గణితం, ఫిజిక్స్‌లపై వచ్చే ప్రశ్నల్లో తేడాలు లేకపోయినప్పటికీ... రసాయన శాస్త్రంలో వేసే ప్రశ్నలు మాత్రం ఇంటర్మీడియట్ సిలబస్‌ను మించిపోయి ఉంటుంది.
అందులోను ఈ ప్రవేశ పరీక్షల్లో వేసే బహుళైచ్ఛిక ప్రశ్నలు విద్యార్ధులను ఒక్కోసారి అయోమయానికి గురిచేసేలా ఉంటాయి. ఎందుకంటే బిట్‌శాట్, ఎంసెట్, ఐఐటీ వంటి ఉన్నత ప్రవేశ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల్లో 60 శాతానికి పైగా చిక్కు ప్రశ్నలే వస్తుండటాన్ని మనం గమనిస్తాం.
ఇక అధ్యాపకులు తమ అపార అనుభవంతో పాఠ్యాంశాలను బోధించే అంశాలను అవగాహన చేసుకుని... సంక్లిష్టమైన పాఠ్యాంశాలను సైతం సరళంగా, సులభంగా అకళింపు చేసుకునేలా విద్యార్థులు తమను తాము మెరుగులు దిద్దుకోవాలి. ముఖ్యంగా తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి.
తరగతి ముగిసిన తర్వాత క్లాస్‌రూమ్‌లో తోటి విద్యార్ధులతో ఆరోజు జరిగిన పాఠ్యాంశాలపై చర్చించుకుంటే మరీ మంచిది. మెరుగైన ఫలితాలకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. సందేహం ఉన్న ప్రతి విషయాన్ని అట్టే అధ్యాపకుల ఎదుట కాకుండా.. స్వీయ విశ్లేషణలతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఎంసెట్, ఐఐటీనే కాదు ఇతర ఉన్నత ప్రవేశపరీక్షల్లోనూ ఉత్తీర్ణులు కావచ్చు.

కోరింత దగ్గు








               




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కోరింత దగ్గు అవగాహన ,Pertussis(whooping cough)Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఇది చిన్న పిల్లలలో శ్వాసమార్గాన్ని బాధించే రోగం. తెరలు-తెరలుగా దగ్గు వస్తుంది. బొర్డ్‌టెల్లా పెర్టుసిస్ అనే సూక్ష్మ క్రిమివల్ల ఈవ్యాధి వస్తుంది. 2-7వయస్సు lO రావచ్చు కాని, ఇది ఏడాది లోపు పసి పిల్లలకి వస్తే బాగా ఉధృతంగా వస్తుంది.చిన్న పిల్లలకు సోకే అంటువ్యాధి కోరింత దగ్గు. ఈ వ్యాధి ప్రారంభంలో ముందుగా జలుబు చేసి ముక్కు కారుతుంది. తరువాత కొద్దిపాటి జ్వరం, దగ్గు వాస్తయి. సాధారణంగా రెండు నుంచి ఏడేళ్లలోపు చిన్నారులు కోరింత దగ్గు వ్యాధికి గురవుతారు.ఈ వ్యాధిలో రోగి దగ్గుతున్న ప్పుడు 'వూఫ్‌ అనే ఒక ప్రత్యేకమైన శబ్దం వెలువడుతుంది. ఈ కారణంగా దీనిని వూఫింగ్‌ కాఫ్‌ అని వ్యవహరిస్తారు.

కారణాలు

బ్యాక్టీరియా - బోర్డెటెల్లా పెర్ట్యూసిన్

వ్యాప్తి

వ్యాధి గ్రస్ధుడు తుమ్మినప్పుడు, దగ్గినపుడు తుంపర్ల (లాలాజలం) ద్వారా వ్యాపిస్తుంది. మరియు ముక్కు చీమిడి ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది.

లక్షణాలు

సాధారణంగా వ్యాధి లక్షణాలు. వ్యాధి సంక్రమించిన 7 నుండి 17 రోజులు తర్వాత ప్రారంభమవుతాయి.

1. సాధారణంగా 2 సం. లోపు పిల్లల్లో కన్పిస్తుంది.
2. ఈ లక్షణాలు 6 వారాల లోపు తగ్గుతాయి.
3. ఈ వ్యాధి 3 దశలుగా విభజింపబడింది.

మొదటి దశ - ముక్కు నీరు, కన్నీరు కారటం, ఆకలి తగ్గుట, నీరసంగా ఉండటం, రాత్రి పూట దగ్గు మరియు తుమ్ములు
రెండవ దశ - తెరలు తెరలుగా దగ్గుతో పాటు పక్షి వలె శ్వాస తీసుకొనుట.
మూడవ దశ - ఇది నయమయ్యే దశ ఇది నాలుగవ వారం తర్వాత మొదలవుతుంది.
ఈ దశలో దగ్గు ఉంటుంది. కానీ తీవ్రంగా ఉండదు.
ఈ వ్యాధి పెద్దల్లో వస్తే 2 వారాల లోపు తగ్గుతుంది.

శారీరకంగా దృఢంగాఉండే పిల్లల్లో ఈ వ్యాధి మంద్రస్థాయిలోనే కనిపించినా, దుర్బలంగా ఉండే వారిలో తీవ్రస్థాయిలో బాధిస్తుంది. వ్యాధి కారక క్రిములు శరీరంలో ప్రవేశించిన నాటినుంచి వ్యాధి బైటపడటానికి వారంనుంచి పదిహేను రోజులు పట్టవచ్చు. ఈ కాలాన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అని వ్యవహరిస్తారు.

కోరింత దగ్గు అతి సాధారణమైన దగ్గుగానే ప్రారంభమైనా, తరువాత ఇది తీవ్రస్థాయికి చేరి తెరలు తెరలుగా దగ్గు వస్తుంది. దీనితో శ్వాస తీసుకోవడం కష్టతరమవుతుంది.కొన్ని కేసుల్లో దగ్గు తెరలుతెరలుగా వస్తుంది. అనంతరం రోగి దీర్ఘంగా శ్వాస తీసుకుంటాడు. మరికొన్ని కేసుల్లో రోగి విపరీతంగా దగ్గుతాడు. ఊపిరి తిత్తులలోని గాలి మొత్తం నిశ్వాస రూపంలో వెళ్లిపోతుంది. తరువాత సుదీర్ఘంగా శ్వాస తీసు కుంటాడు.దగ్గుతోపాటు వాంతులు కూడా సంభవిం చవచ్చు. రోగి పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు వల్ల కళ్లు ఎరు పెక్కుతాయి.ముక్కునుంచి రక్తం కారే అవకాశాలున్నాయి.ముఖం ఉబ్బుతుంది.

తీవ్రమైన కోరింత దగ్గుతో బాధపడేవారికి వాంతులయ్యే అవకాశాలు న్నాయి కనుక ఆహారాన్ని కొద్ది మొత్తాలలో ఇవ్వడం మంచిది. ఈ వ్యాధిగ్రస్తులు బ్రాంకైటిస్‌తో బాధపడే అవకాశాలు కూడా హెచ్చుగా ఉన్నాయి. ఊపిరితిత్తులు వాపునకు గురవుతాయి. బ్రాంకో న్యుమోనియా, ఫిట్స్‌వంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చు.వ్యాధి సోకిననాటినుంచి ఆరు వారాలపాటు రోగిని ఇది బాధించి తగ్గుముఖం పడు తుంది.అయితే కొన్ని కేసుల్లో వ్యాధి తగ్గుముఖం పట్టడానికి కొన్ని నెలలు కూడా పట్టవచ్చు.

నిరోధక విధానం

3,4 మాసాల వయస్సులో ఆరంభించి ఒక మాసం వ్యవధితో మూడు ఇంజెక్షనులు ఇవ్వాలి. ఈ రోగం రాకుండా పెర్టసిస్, డిఫ్తీరియా, టెటనస్ వాక్సిన్‌లతో కలిపి మూడు వాక్సిన్ (DPT triple antigen) ల రూపంలో ఇస్తే, రోగ నిరోధక శక్తి బాగా ఏర్పడుతుంది. బిడ్డకు వ్యాధి సోకిన తర్వాత ఈ వాక్సిన్ ఇచ్చి ప్రయోజనం లేదు. కోరింత దగ్గు రాగానే, బాగా గాలి వచ్చే గదిలో శయ్యావిశ్రాంతి (bed rest) ఇవ్వాలి. తక్కిన పిల్లలను దగ్గరికి రానివ్వకూడదు. నోటివెంటా, ముక్కు వెంటా వచ్చే స్రావాలను కాగితంలోనో, పాతగుడ్డతోనో సేకరించి తగులపెట్టెయ్యాలి. ఈ జబ్బుతో బాధ పడుతున్న బిడ్డ ఉపయోగించే దుస్తులూ, పాత్రలూ, వస్తువులూ తక్కిన బిడ్డలు వాడరాదు.


జాగ్రత్తలు
రోగినిచలినుంచికాపాడాలి.తద్వారా బ్రాంకో న్యుమోనియా రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఉత్తేజితం చేసే ఆహార పదార్థాలు ఏమీ ఇవ్వకూడదు. ఫిట్స్‌, కోపంవంటి ఉద్రేకాలకు గురి కాకుండా చూడాలి.
లేకపోతే ఇవి పరిస్థితిని మరింత క్షీణింపజేస్తాయి. ఆలివ్‌ ఆయిల్‌ను ఛాతిపైన, వెన్నెముక పైన రాయడం వలన కొంతఉపయోగం ఉంటుంది. గాలి ధారాళంగా ఆడేగదిలో రోగికి విశ్రాంతి కల్పించాలి.

వేసవి కాలము- ఆరోగ్యము

                                       ఎండాకాలము లో
వేసవి కాలము ప్రతి సంవత్సరము వస్తూ వుంటుంది , ప్రతి కాలము ఆరోగ్య రీత్యా  ప్రతి కాలము సమస్యలు వుంటూ వుంటై . జబ్భులు ,ఆరోగ్య సమస్యలు ఉంటూనే వుంటై కాని మనము ప్రతి రోజు మన ఆరోగ్య సమస్యలతో పోట్లడుతూ వుండాలి . కారణమూ ప్రతి జీవికి అనిటికన్నా విలువైనది ఆరోగ్యము కాబట్టి .

వేసవి - పిల్లలకు సెలవలు వారికీ బయట వెళ్లి  ఆడాలని తిరగాలని వుంటుంది . మన జాగర్త లో మనముంటే పరవాలేదు కానీ మనకి ఈవేసవి లో సమస్యలు గురించి కొద్దిగా ఆవగాహన వుంటే మంచిది వాటి చిట్కాలు గురించి తెలుస్తే ఇంక మంచిది .

వేసవి లో సమస్యలు లో  వడదెబ్బ  వకటి మనవంట్లో మేనరల్స్ వాటర్ రూపములో వుంటై వెసవితాపానికి నీరు చమట రూపాన ఇంకిపోవటము వలన డిహైడ్రేషన్ ఇంకా  చాల సమస్యలు వస్తాయి కాబట్టి . మనము కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది
1 )  నీరు మనము ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది . మేనరల్స్ మన శరీరానికి చాల అవుసరము .
2 ) వేసవి లో సీజనల్ ఫ్రూట్స్ వుంటై అవి నీళ్ళలో  మేనరల్స్ కాకుండా పోషకాలతో ఉంటాయి కాబట్టి అవి తీసుకోవట్టము మనకు ఎంతో మేలుచేస్తాయి . అవి పుచ్చకాయలు లో , కోబరి బొండాము లో ,దోస ,కర్బుజ లో ,లస్సి ,మజ్జిగ ,బార్లి , తీసుకొంటే చాల మంచిది వాటిల్లో నీరు , పోషకాలతో ,ఎలక్ట్రోలైట్స్ కూడా మన శరీరానికి అందుతాయి .  
3 ) ఎండ కాలము softdrinks బదులు  నీరు తీసుకొంటే మంచిది సోఫ్త్ద్రింక్స్ మంచి కన్నా హాని ఎక్కువ కలగిఉంటాయి .
4 ) రోజు పెసర పప్పు క్యారట్లు గుమ్మడి ,బీర , పొట్లకాయ దోసకాయ ,ఆకుకోరలు మన ఆహారము లో ఉండేలా చూసుకోవాలి .
5 ) రోజు గ్లాసుడు నిమ్మరసము తీసుకోవట్టము  ఎంతో మంచిది , తాటి ముంజలు , ద్రాక్ష కూడా ఎంతో మంచిది .

Mana Telugu Tv Presents....Yoga part4

నీటిపై యోగాసనాలు

యోగ సమాచారము 





నీటిపై యోగాసనాలు


నీటిపై యోగాసనాలు
పుట్లూరు, నవంబర్‌ 23 ప్రభాతవార్త 
సాధనతో ఎంతో కష్టమైన పనిని కూడా సులువుగా చేయవచ్చని కొనుగుంట పల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు నిరూపించారు. నీటిపై ఏకం గా యోగాసనాలు వేస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నారు. 60 ఏళ్ల వయ సుగల నారాయణరెడ్డి తాడిపత్రి మండలం కొనుగుంటపల్లిలో రైతు కూలిగా పనిచేస్తున్నాడు. గత పది సంవత్సరాల నుండి యోగాసనాల్లో శిక్షణ పొందా రు. అనంతరం నీటిపై ఆసనాలు వేయడం మొదలుపెట్టారు. దాదాపు 18 సంవత్సరాల కృషితో నీటిపై ఆసనాలు వేయడంలో సఫలమయ్యారు. నీటిపై దాదాపు ఐదు గంటలపాటు పద్మాసనం, శవాసనాలు అవలీలగా వేస్తున్నారు. భూమిపై వేసే ఆసనాల కంటే నీటిపై వేసే ఆసనాల వల్ల రెట్టింపు ప్రయోజ నాలు పొందవచ్చని ఆయన చెబుతున్నారు. రోగనిరోధకశక్తి పెరగడం, శ్వాస, ఉత్వాసల శక్తి పెరుగుతుందని, వెన్నెముక గట్టిపడుతున్నారు.
సాధన లేకుండా నీటిపై ఆసనాలు ప్రమాదకరం : సాధన లేకుండా నీటిపై ఆసనాలు చేయడం ప్రమాదకరమని ప్రముఖ యోగా మాస్టర్‌ శ్రీనివాస్‌ చెబు తున్నారు. ఒకరు చేసిన ఆసనాలను గురువు సూచన లేకుండా సొంతంగా చే యడం వల్ల ప్రమాదానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. యోగా సనాల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతున్నాయని యోగా గురువులు చెబుతున్నారు. ఎలాంటి రియాక్షన్లు లేకుండా ప్రకృతి సిద్ధమైన వైద్యంగా యోగాకు ప్రాధాన్యత పెరుగుతుంది.  సాధన చేయడం వల్ల క్రమంగా కష్టంగా వున్న ఆసనాలను సులువుగా చేయవచ్చని యోగా గురువులు చెబుతున్నారు.





బ్యూటీ టిప్స్‌...









ముఖ సౌందర్యానికి మహిళలు ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయి నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేనందుకు దిగాలు పడుతుంటారు. కానీ ఎలాంటి ఖర్చులేకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సాధనంగా కల బంద పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణం ఉంది.కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా తయారవుతుంది. శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలి న గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతా యంటున్నారు ఆరోగ్య నిపుణలు.

aloe_veraకలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమా న్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూ స్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చ లు తగ్గు తాయి. ఉదయం పరగడుపున కల బంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమ వుతాయి. రేగు చెట్టు ఆకులు కానీ, పండ్లుకానీ, బెరడుకానీ కలబందతో కలపి సబ్బులు, మాయిశ్చరైజర్‌ క్రీము ల ను తయారు చేస్తారు. ఈ క్రీము ముఖానికి రాసుకోవడం వల్ల ము డతలను మాయం కావడంతో పా టు సన్‌స్క్రీన్‌గానూ పనిచేస్తుంది. అలాగే ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.

Raagi Dosas-Vaamu aaku Bajji

స్పైసీ డిష్ "చిల్లీ మష్రూమ్ విత్ నూడుల్స్"








కావలసిన పదార్థాలు :
బటన్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు).. 500 గ్రా.
క్యాప్సికమ్.. 200 గ్రా.
మీడియంసైజు ఉల్లిపాయలు.. 2
అల్లం.. 50 గ్రా
వెల్లుల్లి.. 6 పాయలు
నూనె.. 4 టీ.
కారంపొడి.. 1 టీ.
డార్క్ సోయా సాస్.. 2 టీ.
వెనిగర్.. 2 టీ.
కార్న్‌ఫ్లోర్.. 1 టీ.
మంచినీరు.. 1 కప్పు

తయారీ విధానం :
మష్రూమ్స్‌ను రెండుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్‌లను కూడా సగానికి కట్ చేసి వాటిలోని విత్తనాలను తీసివేయాలి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిలను మెత్తగా పేస్ట్ చేయాలి. ఓ బాణలిలో 5 టీస్పూన్ల నూనెను వేడిచేసి, అందులో నూరిన మిశ్రమాన్ని వేసి వేయించాలి. అందులోనే కారంపొడి కూడా వేసి పావుకప్పు నీటిని చేర్చి, మిశ్రమం గట్టిపడేంతదాకా సిమ్‌లో ఉడికించాలి.

ఆ తరువాత క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కల్ని వేసి తగినంత ఉప్పుకూడా చేర్చి కలిపి, మూతపెట్టి సిమ్‌లో బాగా ఉడికేంతవరకూ మగ్గించాలి. బ్లాక్ సోయాసాస్, వెనిగర్‌లను కూ ఆ మిశ్రమానికి కలిపి, కార్న్‌ఫ్లోర్‌ను కాసిన్ని నీటిలో వేసి కలిపి కూరలో పోయాలి. ఆపై ఒక నిమిషం సిమ్‌లో ఉడికించి దించేయాలి. అంతే చిల్లీ మష్రూమ్ రెడీ..! దీన్ని వేడి వేడిగా వెజిటబుల్ రైస్ లేదా నూడుల్స్‌తో కలిపి సర్వ్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి మరి..!